ట్రంప్‌కు 3 వేల కోట్ల జరిమానా

18 Feb, 2024 04:29 IST|Sakshi

న్యూయార్క్‌:  అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఆయనకు కొత్త కష్టాలు వచి్చపడుతున్నాయి. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో న్యూయార్క్‌ కోర్టు ట్రంప్‌కు శుక్రవారం 364 మిలియన్‌ డాలర్ల (రూ.3,020 కోట్లు) జరిమానా విధించింది.

తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు, బీమా పొందడంతోపాటు ఇతరత్రా ఆర్థికంగా లాభపడినట్లు ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. న్యూయార్క్‌ అటారీ్న, జనరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేత జేమ్స్‌ కోర్టులో దావా వేశారు. దీనిపై న్యాయస్థానం రెండున్నర నెలలపాటు విచారణ జరిపింది.

ట్రంప్‌పై వచి్చన అభియోగాలు నిజమేనని తేలి్చంది. ట్రంప్‌ నిర్వాకం వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు నష్టపోయినట్లు గుర్తించింది. ఈ కేసులో ట్రంప్‌నకు 355 మిలియన్‌ డాలర్లు, ఆయన ఇద్దరు కుమారులు ఎరిక్‌ ట్రంప్, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు 4 మిలియన్‌ డాలర్ల చొప్పున, ట్రంప్‌ మాజీ చీఫ్‌ పైనాన్షియల్‌ ఆఫీసర్‌కు ఒక మిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

అంటే ట్రంప్‌ మొత్తం 364 మిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన డైరెక్టర్‌ లేదా ఆఫీసర్‌గా ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది సివిల్‌ కేసు కావడంతో ట్రంప్‌కు జైలు శిక్ష విధించడం లేదని స్పష్టం చేశారు. న్యూయార్క్‌ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తామని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు చెప్పారు.

whatsapp channel

మరిన్ని వార్తలు