Donald Trump: పంతం నెగ్గించుకున్న ట్రంప్‌.

5 May, 2021 11:16 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతగా ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్‌ అనుచరులు  విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా పార్లమెంట్‌ భవనంపై దాడి చేసేలా ట్రంప్‌ తన మద్దతుదారుల్ని ఉసిగొలిపినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దూసుకెళ‍్లి రిపబ్లిక్‌ పార్టీ జెండాలు ఊపుతూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడి చేరిన ట్రంప్‌ మద్దదారులను పోలీసుల అదుపు చేయడనాకి ప్రయత్నించారు. కానీ ట్రంప్‌ అనుచరులు పోలీసులపై దాడి చేయడానికి యత్నించటంతో హింసాత్మక అల్లర‍్లు చెలరేగి ఐదుగురు మరణించారు.

ఈ అల్లర్లుకు పాల్పడిన 52 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డ తన మద్దతుదారులు ఇళ్లకు వెళ్లిపోవాలని ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ చేసిన ట్వీట్‌ పౌర సమాజ సమగ్రతకు వ్యతిరేకంగా ఉందని ట్విటర్‌ యాజమాన్యం ఆయన ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేసింది.ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ సైతం ట్రంప్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో​ తాను కొత్తగా ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫ్లామ్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తానని ట్రంప్‌ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ట్రంప్ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తరహాలో తాను కూడా సొంతంగా ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రూపొందించుకున్నారు. ట్విటర్‌ తరహాలో www.DonaldJTrump.com/desk URL పేరుతో రూపొందిచిన ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్‌ తన అభిప్రాయాల్ని ప్రజలతో పంచుకుంటారు. ఇక ఆయన ఒక్కరే దానిలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసే విధంగా ఆ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలని మేము నమ్ముతున్నాము’ అనే నినాదం, ‘సేవ్‌ అమెరికా’ పేరుతో కనిపిస్తున్న ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోగో డిజైన్‌ అందరిని ఆకర్షిస్తోంది. 

చదవండి: లండన్‌లో బ్లింకెన్‌తో జై శంకర్‌ భేటీ

మరిన్ని వార్తలు