పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

31 Jan, 2023 12:40 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దేశ నిఘా వ్యవస్థ గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దేశ ఇంటిలిజెన్స్‌ విభాగంలో పని చేసే వాళ్ల కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతానంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాం ట్రూత్‌ సోషల్‌లో.. తన నమ్మకాలు మారయంటూ..సీఐఏ, నాసా, ఎఫ్‌బీఐ వంటి సైబర్‌ సెక్యూరిటీ తోసహా గూఢచార సంస్థలను తక్కువ చేస్తూ రాసుకొచ్చారు. పైగా ఇలాంటి స్థితిలో తాను రష్యా అధ్యక్షుడినే ఎక్కువగా నమ్ముతానంటూ పోస్ట్‌ పెట్టారు. 2018లో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఉండగా కూడా పుతిన్‌కి మద్దతుగా మాట్లాడి.. పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 

ఈ వ్యాఖ్యలతో యూఎస్‌లోని రిపబ్లికన్లు, డెమోక్రటిక్‌ సభ్యులు విస్మయానికి గురయ్యారు. యూఎస్‌ ఇంటిలిజెన్స్‌ విభాగంలో పనిచేసే వాళ్ల గురించి, వారి పనితనం గురించి తక్కువ చేసి మాట్లాడటాన్ని మిగతా నాయకులంతా తీవ్రంగా ఖండించారు. పైగా రష్యా అధ్యకుడి గురించి ప్రస్తావించడం వారికి మరింత ఆగ్రహం తెప్పించింది.

ఇదిలా ఉంటే.. 2016 యూఎస్‌ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు ప్రమేయం ఉన్నట్లు ఇంటిలిజెన్సీ నిర్ధారించడాన్ని కూడా ట్రంప్‌ అంగీకరించడంతో విమర్శల పాలయ్యాడు. దీని ఫలితంగా రష్యా ప్రమేయానికి సంబంధించి.. యూఎస్‌ న్యాయశాఖకు చెందిన ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ నేతృత్వంలో అతని అంతర్గత సభ్యులను సంత్సరాల తరబడి విచారించింది. ఇది ఒక రకంగా ట్రంప్‌ రాజకీయ జీవితాన్ని నష్టపరిచేందుకు దారితీసింది.

చివరికి అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడమే గాక సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇటీవలే ఆయన తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపించేవాడిని అంటే పోస్ట్‌ పెట్టి వార్తలో నిలిచారు. అది మరువక మునుపై మరోసారి అనూహ్యమైన రీతీలో వ్యాఖ్యలు చేసి అపఖ్యాతిని కొనితెచ్చుకుంటున్నారు ట‍్రంప్‌.

(చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!)

మరిన్ని వార్తలు