బైడెన్‌ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్‌!

15 Nov, 2020 21:17 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయాన్ని అంగీకరించేది లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్‌ వల్లే డెమొక్రాట్ అభ్యర్ధి బైడెన్ గెలిచారని ఆయన ట్వీట్ చేశారు. అక్రమాలకు పాల్పడటం ద్వారానే ఆయన‌కు గెలుపు సాధ్యమైందని ఆరోపించారు. తమ లీగల్ టీం న్యాయపోరాటం చేస్తుందని ట్రంప్‌ తన ప్రకటనలో తెలిపారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు చెప్తున్న సంగతి తెలిసిందే. ఇక ట్రంప్‌ తీరుపై డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు. బైడెన్‌ ఘన విజయాన్ని తక్కువ చేసి చూపించడానికి, అమెరికా ఎన్నికల విధానంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడానికే ట్రంప్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్‌ ఆరోపణలతో జరిగేమీ లేకపోయినప్పటికీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లకు అడ్డుతగిలినట్టవుతోంది. అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో వెల్లడైన తుది ఫలితాల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మరోవైపు బెడెన్‌ విజయాన్ని జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు