2024 ఎన్నికల్లో పోటీ చేస్తా

9 Sep, 2022 04:56 IST|Sakshi

న్యూజెర్సీ:  అగ్రరాజ్యం అమెరికాలో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్న సంకేతాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చారు. తాను పోటీలో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ముందంజలో నిలుస్తానని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తన పాలనలో భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

భారత్‌కు తనకంటే అమెరికా అధ్యక్షుడిగా గొప్ప మిత్రుడు గతంలో ఎన్నడూ దొరకలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీని అడిగితే బాగా తెలుస్తుందని అన్నారు. ఇండియాతో, నరేంద్ర మోదీతో తనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. మోదీతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని.. మోదీ, తాను మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం తనకు అండగా నిలుస్తోందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు