ఎఫ్‌బీఐపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం

30 Nov, 2020 08:03 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. అమెరికా నిఘా సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)పై సైతం నిందలు మోపడానికి వెనుకాడడం లేదు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అందుకే ఫలితాలు తారుమారు అయ్యాయని, తనకు అన్యాయం జరిగిందని ట్రంప్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుదారులు న్యాయ పోరాటం సాగిస్తున్నారు. తన వాదనను బలపరిచేలా ఎఫ్‌ఐబీ ఒక్క ప్రకటన కూడా చేయలేదని ట్రంప్‌ ఆక్షేపించారు. ఆయన ఆదివారం ఓ ఇంటర్వ్యూలో.. ఎఫ్‌బీఐ క్రియాశీలతను కోల్పోయిందన్నారు. ఆ సంస్థ తీరుతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పారు. ఎఫ్‌బీఐలోని కొందరు  తనకు వ్యతిరేకంగా పని చేశారని ధ్వజమెత్తారు. (చదవండి: శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్‌పై అనుమానం!)

మరిన్ని వార్తలు