అమెరికా చరిత్రలో ఇదో ఘోర ఓటమి

17 Aug, 2021 01:55 IST|Sakshi

అఫ్గాన్‌ పరిణామాలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: అఫ్గాన్‌ను తాలిబన్‌ వశం చేసుకోవడం పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం స్పందించారు. జో బైడెన్‌ అఫ్గాన్‌ పట్ల దిగ్గజ నిర్ణయం తీసుకున్నారంటూ అవహేళన చేశారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద ఓటమిగా ఇది నిలబడి పోతుందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై వైట్‌ హౌజ్‌ ఇంకా స్పందించలేదు. వారాం తంలో క్యాంప్‌ డేవిడ్‌లో గడపుతున్న అమెరికా అధ్య క్షుడు జో బైడెన్‌ దేశ అత్యున్నత భద్రతా సలహాదా రులతో భేటీ అయినట్లు వైట్‌ హౌజ్‌ తెలిపింది.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరఫున పని చేసిన మాజీ రాయబారి నిక్కీ హేళీ సైతం అఫ్గాన్‌ వ్యవహా రంపై పెదవివిరిచారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు వెనక్కు తిరిగి వచ్చేందుకు తాలిబన్‌ను బతిమిలాడుకోవడాన్ని అమెరికన్లు సహించలేరని అన్నారు. అందులోనూ ప్రత్యేకించి అఫ్గాన్‌లో ప్రా ణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు ఇలాంటి ఓ ముగింపును ఊహించ లేదన్నారు. మాజీ విదే శాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడు తూ.. తాను విదేశాంగ మంత్రిగా ఉన్నా, లేదా ట్రంప్‌లా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్నా.. అమెరి కాకు వ్యతిరేకంగా కుట్ర పన్నితే ఎలాంటి పరిణా మాలు ఉంటాయో తాలిబన్‌కు రుచిచూపేవాన్నని వ్యాఖ్యానించారు.

ఖాసీం సులే మానీకి ఆ విషయం అర్థమైందని, తాలిబన్‌కు కూడా అది అర్థమ య్యేదని పేర్కొన్నారు. అయితే అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్‌ మాట్లా డుతూ.. అమెరికా తాలిబన్లను బతిమిలాడుకోలే దని చెప్పారు. తమపైగానీ, తమ ఆపరేషన్లపైగానీ దాడులు చేస్తే ప్రతిచర్య ఉంటుందని చెప్పినట్లు వెల్లడించారు. మానవ హక్కులను కాపాడటం, ఉగ్రవాదులను పోషించకపోవడం వంటి నిర్ణయా లు తీసుకుంటే అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వాన్ని తాము గుర్తిస్తామని, కలసి పని చేస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు