సొంత బ్రాండ్‌ షూస్‌ విడుదల చేసిన ట్రంప్‌

19 Feb, 2024 05:32 IST|Sakshi

ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత బ్రాండ్‌ షూస్‌ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్‌ సెంటర్‌లో వాటిని ప్రదర్శించారు. బంగారు వర్ణం షూలు 399 డాలర్లకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు విక్టరీ47 అనే సెంటును కూడా విడుదల చేశారు.

ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిన నేరానికి కోర్టు ఏకంగా 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించిన మరునాడే ట్రంప్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ బరిలోకి దిగనున్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు