‘నేను ఎక్కుకాలం బతకను.. నా కొడుకుకు ఎలా చెప్పాలి’

13 May, 2021 12:31 IST|Sakshi

కెనడా: మాటలకు అందనిది అమ్మ ప్రేమ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు.  ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. కెనడాకు చెందిన న్యూరో సైంటిస్ట్‌ చౌదరి నాడియా క్యాన్సర్‌తో పోరాడుతోంది. నేను త్వరలో క్యాన్సర్‌తో మరణిస్తానంటూ నాడియా చేసిన హృదయ విదారక ట్వీట్‌.. ఆమె ఫాలోవర్లను బాధలో మునిగేలా చేసింది. కాగా డాక్టర్‌ చౌదరి గత సంవత్సరం అన్యారోగ్యంగా ఉండటంతో జూన్‌ 2020 న పరీక్షలుచేయించుకున్నారు. దీనిలో ఆమెకు అండాశయ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ విషయాలను బుధవారం ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

‘‘ఇక నేను ఎంతో కాలం జీవించను. ఈ రోజు ఆ విషయాన్ని నా కొడుకుకి తెలియచేయాల్సిన అవసరం ఉంది.  ఈ సాయంత్రం నా కన్నీటితో ధైర్యం తెచ్చుంకుంటాను. అది నా కొడుకుని ఓదర్చడానికి సహాయపడుతుంది.’’ అని ఆమె ట్విటర్లో‌ పేర్కొన్నారు. దాంతో ఆమె ఫాలోవర్లు బాధాతప్త హృదయాలతో ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. ‘‘మీకు నా ప్రేమను పంపుతున్నాను. ప్రపంచంలోని ప్రతి తల్లీ మీకు మనోధైర్యాన్ని, బలాన్ని అప్పుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను.’’అంటూ ట్వీట్‌ చేశారు. మరో నెటిజన్‌ ‘‘మీ మాటలు నా మనసును తాకాయి. ఈ గందరగోళ ప్రపంచంలో ఇదో సుదీర్ఘ విరామం’’ అంటూ రాసుకొచ్చారు.

దానికి నాడియా స్పందిస్తూ.. ‘‘నా హృదయం బద్దలైంది. మేము చాలా ఏడ్చి కుదుటపడ్డాం. నా కొడుకు చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు. నేను ఎక్కడ ఉన్నా తన ఎదుగుదలను గమనిస్తాను. ఈ రోజు నా జీవితంలో చాలా కష్టతరమైన రోజు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. కాగా కోవిడ్‌-19 టీకా జాబితాలో క్యూబెక్ క్యాన్సర్ రోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని నాడియా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

(చదవండి: కరోనా టీకాతో గర్భంలోని మాయకు నష్టం లేదు)


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు