మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్‌ కంటితో చూడొచ్చు..

20 Sep, 2022 07:33 IST|Sakshi

మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్‌ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్‌ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్‌ ఫొటో పురస్కారాల్లో అర్బన్‌ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు.

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం

సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు

మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్‌

మరిన్ని వార్తలు