కింగ్‌ చార్లెస్‌ని కలిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...సంతాప పుస్తకంలో..

19 Sep, 2022 10:56 IST|Sakshi

లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బేలో క్వీన్‌ ఎలిజబెత్‌2 అంత్యక్రియలు సెప్టంబర్‌ 19న సోమవారం 11 గంటలకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్‌ తరుఫున క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు హాజరైందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కి చేరుకున్నారు కూడా. ఆ తర్వాత బకింగ్‌హామ్‌ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్‌ హౌస్‌లో ముర్ము ముందుగా కింగ్‌ చార్లెస్‌ని కలిశారు. తదనంతరం క్వీన్‌ ఎలిజబెత్‌2 జ్ఞాపకార్థం ద్రౌపది ముర్ము సంతాప పుస్తకంపై సంతకం చేశారు.

ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాదు ముర్ము వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉన్న బ్రిటన్‌ రాణి శవపేటిక వద్ద క్వీన్‌ ఎలిజబెత్‌కి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్‌ తరుపున సంతాపం తెలియజేసేందుకు ఆమె సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు బ్రిటన్‌ అధికారిక పర్యటనలో ఉ‍న్నారు.

ఈ పర్యటన నిమిత్తం ముర్ము విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో సహా తన పరివార సభ్యులతో కలిసి లండన్‌లోని గ్యాట్రిక్‌ విమానాశ్రయానకి చేరుకుని అక్కడ నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంకు చేరకున్న ద్రౌపది ముర్ముకు బ్రిటన్‌లోని భారత హై కమిషనర్‌ ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేలోని వెస్ట్‌గేట్‌లో జరిగే క్వీన్‌ ఎలిజబెత్‌2 అంత్యక్రియలకు హాజరయ్యి, తదనంతరం బ్రిటన్‌ కామన్వెల్త్‌ అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్‌ క్లీవర్లీ నిర్వహించే రిసెప్షన్‌కి హాజరవుతారు.

(చదవండి: రాణి ఎలిజబెత్‌2 అంత్యక్రియలు.. లండన్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)

మరిన్ని వార్తలు