నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్‌లా సర్జరీ! కానీ..

1 Mar, 2023 10:27 IST|Sakshi

ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు.

వివరాల్లోకెళ్తే..థాయ్‌ డ్రగ్‌ డీలర్‌ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్‌ సవాంగ్‌జాంగ్‌ అనే వ్యక్తి కొరియన్‌లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్‌గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్‌ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్‌ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో  ఉంటున్న సవాంగ్‌జాంగ్‌ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్‌గా అభివర్ణించారు.

ఐతే అతను క్లాస్‌ వన్‌ డ్రగ్‌ అయిన ఎక్స్‌టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్‌జాంగ్‌ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్‌ డీలర్‌గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల​ థాయ్‌ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. 

(చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్‌పై విరుచుకపడ్డ నిక్కీ)

మరిన్ని వార్తలు