11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్‌మెంట్‌లో తాగి విమానంలో రచ్చ రచ్చ..

16 Jul, 2022 10:18 IST|Sakshi

ఇంగ్లండ్‌: విమానంలో తాగి రచ్చ రచ్చ చేశాడు ఓ వ్యక్తి. 11 ఏళ్ల తర్వాత స్నేహితుడితో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానే ఎగ్జైట్‌మెంట్‌లో అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు విమానంలోని సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

అనంతరం సదరు వ్యక్తి కూర్చున్న సీటు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతడు తాగి ఉన్నాడని, వోడ్కా బాటిల్‌లో మూడో వంతు కాళీ చేశాడని సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో అతడ్ని విమానం నుంచి దిగిపోమని పోలీసులు సూచించారు.  అతడు మాత్రం పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. నా లగేజ్‌ను మీరు మోసుకొస్తారా? అని పోలీసులను ప్రశ్నించాడు. అంతేకాదు తనతో పోట్లాటకు రావాలని వాగాడు.

చివరకు పోలీసులు అతడ్ని విమానం నుంచి దింపి వ్యానులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ విమానంలోకి వెళ్లి సదరు వ్యక్తి స్నేహితుడ్ని కూడా విమానం నుంచి దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు.

తాగి రచ్చ చేసిన  వ్యక్తి పేరు ఆశ్లే క్రచ్లీ(27). ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసముంటాడు. హాలిడే ట్రిప్‌కు పోర్చుగల్‌కు వెళ్లే సమయంలో ఇలా చేశాడు. 11 ఏళ్ల తర్వాత తనకు హాలిడే వచ్చిందనే ఉత్సాహంలోనే అతడు ఎగ్జైట్‌ అయి ఇలా చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. క్రచ్లీ తన ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఇబ్బందికర ప్రవర్తనకు క్రచ్లీ రూ.30వేలు జరిమాన కట్టాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు రూ.8వేలు, బాధిత సిబ్బందికి రూ.12వేలు చెల్లించాలని చెప్పింది.

చదవండి: మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ!

మరిన్ని వార్తలు