కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా

24 Dec, 2022 16:40 IST|Sakshi

కారుతో ఢీకొట్టి ఇద్దరు మహిళలను చంపినందకు ఇద్దరు వ్యక్తులకు సుమారు రూ. 90 లక్షలు దాక జరిమానా విధించింది దుబాయ్‌ ట్రాఫిక్‌ కోర్టు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగ్లాదేశీ కాగా, మరోకరు భారతీయ వ్యక్తి. గత జులై నెలలో దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సౌదీ మహిళలు మృతి చెందడానికి ఆ ఇద్దరే వ్యక్తులే కారణం అని కోర్టు నిర్ధారించి ఈ శిక్ష విధించింది.

48 ఏళ్ల భారతీయ డ్రైవర్‌కి  సుమారు రూ. 45 వేలు జరిమాన విధించడం తోపాటు దాదాపు రూ. 18 లక్షలను బ్లడ్‌మనీగా కట్టమని ఆదేశించింది. అలాగే మిగతా డబ్బును బంగ్లాదేశ్‌ వ్యక్తిని చెల్లించమని దుబాయ్‌ కోర్టు ఆదేశించింది. బంగ్లాదేశ్‌ వ్యక్తి, భారతీయ డ్రైవర్‌ సంఘటన జరిగినప్పుడూ చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఢీ కొన్న కొద్దిసేపటికే ఆ ఇద్దరు సౌదీ మహిళలు మృతి చెందారని, అలాగా బాధితుల కుటుంబంలోని మిగతా నలుగురు కూడా ఆ ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా ఆ ఘటన రోజు దుబాయ్‌లోని అల్-బర్షా ప్రాంతంలో బంగ్లాదేశ్‌ వ్యక్తి తన కారుని రోడ్డు మధ్యలో ఆపి రివర్స్‌  చేస్తుండగా...మరో కారులో వస్తున్న భారతీయ డ్రైవర్‌ చూడకపోవడంతో ఆ కారుని గట్టిగా ఢీ కొట్టాడు. సరిగ్గా అదే సమయంలో సౌదీకి చెందిన కుటుంబంతో వస్తున్న​ కారుని అనుకోకుండా ఈ ఇద్దరు వ్యక్తులు తమ కార్లతో దారుణంగా ఢీకొట్టారు.

(చదవండి: వాట్‌ ఏ మాస్క్‌..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు)

మరిన్ని వార్తలు