పావురానికో గూడు.. భళా ప్రిన్స్!

14 Aug, 2020 12:09 IST|Sakshi

బాల‍్కనీలోకి పక్షులు రాకుండా నెట్‌లు వేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఒక ఆసక్తికరమైన సంగతి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. పావురం గూడు కోసం ఖరీదైన కారును కూడా పక్కన పెట్టిన వైనం నెటిజనుల ప్రశంసలందుకుంటోంది. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!)

వివరాలను పరిశిలిస్తే.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు చెందిన మెర్సిడెస్ బెంజ్‌ ఎస్‌యూవీ విండ్‌షీల్డ్‌పై ఒక పావురం జంట గూడు చేసుకొని, గుడ్లు కూడా పొదగడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్స్ ఆ గూడుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా కారును వాడకూడదని నిర‍్ణయించుకున్నారు. అలాగే కారు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన టైమ్‌ ల్యాప్‌ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు జీవితంలో చాలా చిన్న విషయాలు సరిపోతాయంటూ కమెంట్‌ చేశారు.  దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 10లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.

A post shared by Fazza (@faz3) on

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా