లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి

21 Oct, 2020 08:33 IST|Sakshi

రేక్‌జావిక్‌: నైరుతి ఐస్లాండ్ అంతటా మంగళవారం 5.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ఈ సమయంలో కోవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడానికి దేశంలో చేపడుతన్న చర్యలపై ప్రధానమంత్రి కాట్రిన్ జాకోబ్స్‌డోట్టిర్ వాషింగ్టన్ పోస్ట్‌ లైవ్ స్ట్రీమ్‌కు ఇంటర్వ్యూ  ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో జాకోబ్స్‌ ఆ శబ్ధం విని జో ‘ఓహ్ మై గాడ్, భూకంపం’ అని పెద్దగా అని తరువాత మళ్లీ యధాస్థితికి వచ్చారు. కాలమిస్ట్‌ డేవిడ్‌ ఇగ్నేషియస్‌ అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

చూడండి: గూగుల్‌ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు