వైర‌ల్‌: దొంగ‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన పోలీసు

3 Dec, 2020 18:37 IST|Sakshi

దొంగ‌లు క‌నిపిస్తే చాలు జ‌నాలు హ‌డ‌లెత్తిపోతారు. కానీ పోలీసులు మాత్రం ఆన్‌డ్యూటీలో ఉన్నా, ఆఫ్‌డ్యూటీలో ఉన్నా వారినే తిరిగి భ‌య‌పెడుతుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిందీ ఘ‌ట‌న‌. ద‌క్షిణ అమెరికాలోని ఉరుగ్వే రాజ‌ధాని మాంటెవిడియోలో న‌ల‌భై ఆరేళ్ల పోలీసాఫీస‌ర్ త‌న కొడుకుతో క‌లిసి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌కు వెళ్లాడు. ఐస్‌క్రీమ్ కొనుక్కుని తండ్రీకొడుకులిద్ద‌రూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌లో ఇద్ద‌రు ఆగంత‌కులు జాకెట్లు వేసుకుని వీళ్లు కూర్చున్న టేబుల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వీళ్ల‌ను బెదిరించి డ‌బ్బులు గుంజ‌డం కోసం ఏదో ఆయుధాన్ని తీసేందుకు జేబులో చేయి పెట్టారు. (చ‌ద‌వండి: వైరల్‌: కూతురు స్కూల్‌ వీడియోలో తండ్రి డ్యాన్స్‌)

వాళ్ల వాల‌కం, దొంగ చూపులు ప‌సిగ‌ట్టిన‌ పోలీసు వెంట‌నే అల‌ర్ట్ అయ్యాడు. ఎడ‌మ చేతిలో ఉన్న‌ కోన్ ఐస్‌క్రీమ్ జార‌విడ‌వ‌కుండా ప‌ట్టుకుని, కుడిచేతితో తుపాకీ అందుకుని నిందితుల‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించాడు. ఊహించ‌ని దెబ్బ‌కు తోక ముడిచిన దొంగ‌లు బ‌తుకు జీవుడా అని అక్క‌డి నుంచి వెన‌క్కు చూడ‌కుండా పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసు ఎడ‌మ‌ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ఏమాత్రం కింద‌ ప‌డ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇదంతా అక్క‌డి సీసీటీవీలో రికార్డ‌వ‌గా ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇక ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి ఛాతీలోకి బుల్లెట్ దిగ‌డంతో చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌డు కోమాలో ఉన్నాడు. (చ‌ద‌వండి: పాక్‌ తింగరి పని.. ఫోటోలు వైరల్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా