సూయజ్‌ లో చిక్కుకున్న రాకాసి నౌకపై భారీ జరిమానా

13 Apr, 2021 17:09 IST|Sakshi

సూయజ్‌ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’పై ఈజిప్ట్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెలలో సూయజ్‌ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్‌ ప్రభుత్వ అధికారులతో ఎవర్‌ గివెన్‌ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్‌ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని చెబుతున్నారు.

భారీ కార్గో షిప్ ప్రస్తుతం సూయజ్ కెనాల్ హోల్డింగ్ సరస్సులో ఉంది. ఇక్కడ అధికారులు, ఓడ నిర్వాహకులు దర్యాప్తు కొనసాగుతున్నారని చెప్పారు. భారీ నౌక యజమానులతో ఆర్థిక పరిష్కారం కోసం అధికారులు చర్చలు జరుపుతున్నారని సూయజ్ కెనాల్ చీఫ్ గతంలో చెప్పారు. లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ..  రాకాసి నౌక ఎవర్ గివెన్ జపనీస్ యజమాని షోయి కిసెన్ కైషా లిమిటెడ్‌తో చర్చలు త్వరగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. కాలువ నిర్వహణతో పరిష్కరించుకోవడం కంటే కేసును కోర్టు ముందు తీసుకురావడం సంస్థకు ఎక్కువ హానికరం అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం సూయజ్ కెనాల్ అథారిటీ 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని ఆశిస్తున్నట్లు కాలువ చీఫ్ చెప్పారు, నష్టాల సమస్య చట్టపరమైన వివాదంగా మారితే ఓడను కాలువ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించదని హెచ్చరించారు. పరిహారం చెల్లించడానికి ఎవరు బాధ్యత వహిస్తారో అతను అప్పుడు పేర్కొనలేదు.

చదవండి: డేంజర్ జోన్‌లో వాట్సప్‌ యూజర్లు!

మరిన్ని వార్తలు