రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!

6 Dec, 2021 12:44 IST|Sakshi

ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్‌ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై  పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది.

(చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!)

అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు.

పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు.

ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్‌ చెప్పారు. ఈ మేరకు హసన్‌ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు.

(చదవండి: దేశంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!)


 

మరిన్ని వార్తలు