అమెరికాలో ప్రారంభమైన ఎలక్టోరల్‌ ఓటింగ్‌

15 Dec, 2020 06:34 IST|Sakshi

బైడెన్‌కు 156, ట్రంప్‌కు 106 ఎలక్టోరల్‌ ఓట్లు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం తుది సమాచారం అందేవరకు డెమొక్రట్‌ అభ్యర్థి బైడెన్‌కు 156, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ)కు 106 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. మొత్తం బ్యాలెట్లు డిసెంబర్‌ 23వ తేదీ నాటికి వాషింగ్టన్‌ చేరుకుంటాయి. జనవరి 6వ తేదీన అమెరికా పార్లమెంటు ఉభయసభలు సంయుక్తంగా సమావేశమై ఆ బ్యాలెట్లను లెక్కిస్తాయి. కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నిక లాంఛనమే. అమెరికాలో రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్‌ ఓట్లు ఉంటాయన్న విషయం తెలి సిందే. 

మరిన్ని వార్తలు