హిజాబ్‌: ఇది నగ్నత్వం కాదు.. స్వేచ్ఛ! వలువలు విప్పేసి వీడియో పోస్ట్‌

12 Oct, 2022 08:33 IST|Sakshi
ఆస్పత్రిలో మహ్‌సా అమినీ(ఎడమ-పాత చిత్రం).. ఎల్నాజ్‌ నోరౌజీ(కుడి)

న్యూఢిల్లీ: మహ్‌సా అమినీ(22) మృతి చెంది నెలన్నర గడుస్తోంది. అయినా ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల సెగ చల్లారడం లేదు. పైగా ఇరాన్‌ వనితాలోకం పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతూ పోతోంది.  తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ నటి తన వలువలు విప్పి తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది.

ఇరాన్‌ న‌టి, నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ సాక్రెడ్‌ గేమ్స్‌లో నటించిన ఎల్నాజ్‌ నోరౌజీ(30) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరాన్‌ పోలీసుల నైతికతకు వ్యతిరేకంగా ఓ వీడియోను ఉంచింది. నిండుగా బుర్ఖాలో వచ్చిన ఆమె.. ఒక్కొక్కటిగా ఒంటిపై ఉన్న వలువలు విప్పేస్తూ చివర్లో.. యాంటీ హిజాబ్ నినాదాన్ని పోస్టు చేసి నిరసనను తెలియజేసింది. ‘‘ప్రతి స్త్రీ.. ప్రపంచంలో ఏమూల ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచ్చింది ఆమె ధరించే హక్కును కలిగి ఉండాలి. ఏ మగవాడుగానీ,  మరేయితర స్త్రీగానీ ఆమెను వేరే దుస్తులు ధరించమని అడిగే హక్కు ఉండకూడదు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచింది. 

ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు,  నమ్మకాలు ఉంటాయి. వారిని అంతా గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం. ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం
తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు.. స్వేచ్ఛను మాత్రమే ప్రచారం చేస్తున్నాను అంటూ పోస్ట్‌ చేసిందామె. 

ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్‌, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్‌ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్‌ ట్రెడిషనల్‌ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు.

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

This Video Is Not To Promote Nudity

మరిన్ని వార్తలు