టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కు హ్యాకర్ గ్రూప్ బెదిరింపులు

6 Jun, 2021 20:28 IST|Sakshi

ప్రముఖ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ప్రఖ్యాత హ్యాకర్ గ్రూప్ Anonymous హెచ్చరికలు జారీ చేసింది. ఎలోన్ మస్క్ ను బెదరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో మస్క్ తన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపిస్తూ టెస్లా సీఈఓను హెచ్చరించింది. మస్క్ ఇటీవల చేసిన కొన్ని ట్వీట్లు సగటు పని చేసే వ్యక్తి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు, అతని "పబ్లిక్ టెంపర్ టాంట్రమ్స్" కష్టపడి పనిచేసే వ్యక్తుల కలలను నాశనం చేస్తున్నట్లు ఈ వీడియోలో పేర్కొంది.

టెస్లా సీఈఓ ఇటీవల వేసిన అనేక ఎత్తుగడలను ఈ వీడియోలో వివరించారు. కేవలం కంపెనీ భవిష్యత్ కోసమే ఈ ట్వీట్లు చేస్తునట్లు, క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుకు సంబంధం లేదని ఆరోపించారు. క్రిప్టోకరెన్సీకి సంబందించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవారు ఎవరి చేత ప్రభావం కావొద్దు అని Anonymous హ్యాకర్ గ్రూప్ పేర్కొంది. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు సంబంధించి బిట్‌కాయిన్ చెల్లింపులను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం కంపెనీ స్వలాభం కోసం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ తయారీ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలలో ప్రధానమైన లిథియం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి లిథియం గనులలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు ఈ వీడియోలో ప్రస్తావించారు.

చదవండి: 5జీ టెక్నాలజీ చాలా సేఫ్: సీఓఏఐ

మరిన్ని వార్తలు