ఒక్క రోజులోనే మస్క్‌ సంపద ఎంత పెరిగిందో తెలుసా?

10 Mar, 2021 11:35 IST|Sakshi

ఒకరోజులోనే 25 బిలియన్ డాలర్లు

జెఫ్ బెజోస్‌తో కేవలం 6 బిలియన్ల డాలర్లు తేడా మాత్రమే

వాషింగ్టన్‌: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్,  అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మధ్య నెలకొన్న త్రీవ పోటీ నేపథ్యంలో మరో కొత్త మైలురాయిని సాధించాడు. సంపదపరంగా మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాడు. కేవలం ఒకే ఒక్క రోజులోనే టెస్లా కంపెనీ రికార్డు స్థాయిలో 25 బిలియన్ల డాలర్ల సంపదను సృష్టించింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ సంపద 174 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ సూచీ ప్రకారం, మంగళవారం  టెస్లా షేర్‌ విలువ​ 20 శాతం ఎగిసింది.  ప్రస్తుతం ఎలాన్‌ ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్‌కు కేవలం 6 బిలియన్ల డాలర్లు తేడా మాత్రమే ఉండటం విశేషం. నాస్డాక్ 3.7 శాతం పెరగగా, దిగ్గజ టెక్‌ కంపెనీలు ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌  లాభాలు గడించాయి.(ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?)

ఈ క్రమంలో జెఫ్‌ బెజోస్‌ కంపెనీ అమెజాన్ 6 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. దీంతో బెజోస్‌ నికర విలువ 180 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరిలో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా 210 బిలియన్ల డాలర్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. త్రైమాసికాల్లో నిలకడ లాభాలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ,రిటైల్ పెట్టుబడిదారుల ఉత్సాహం టెస్లా షేర్ల విలువ పెరుగుదలకు  మద్దతునిచ్చాయి.

మరిన్ని వార్తలు