ఇక్కడ గతేడాది నుంచి ఒక్కరు కూడా కరోనా వల్ల చనిపోలేదు, కానీ

11 May, 2021 14:04 IST|Sakshi

లండన్‌ : ప్రపంచలోని పలు దేశాలు కోవిడ్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతుంటే ఇంగ్లండ్‌లో మాత్రం గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు కరోనా మరణాలు నమోదు కాలేదంట. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కావోస్తున్నా.. దాని ప్రభావం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కలా చూపిస్తోంది. మనదేశంలో నమోదవుతున్న కేసులతో, పెరుగుతున్న మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. 

మనదేశంలో కోవిడ్‌ ప్రభావం ఇలా ఉంటే.. ఇంగ్లండ్‌ లో అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జులై తర్వాత నుంచి ఇప్పటి వరకు  ఒక్క మరణం కూడా నమోదు కాలేదని,  మే10 న మాత్రం 2,357 మందికి కరోనా సోకగా, నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌,నార్తన్‌ ఐల్యాండ్‌ లో జీరో మరణాల రేటు నమోదైంది. గత ఏడాది జూలై తర్వాత తొలిసారిగా కోవిడ్‌ మరణాల్ని నివేదించింది. 

ఈ సందర్భంగా యూకే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్ వైట్టీ మాట్లాడుతూ.. 'వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు . కాబట్టే దేశంలో కరోనా కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో తగ్గిపోయాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం కరోనా నిబంధనలు పాటించలేదు.తద్వారా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయని' క్రిస్‌ వైట్టీ వెల్లడించారు. కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. 

చదవండి : కొంత ఊరట.. దేశంలో రెండో రోజూ తగ్గిన కేసులు

మరిన్ని వార్తలు