Extreme Food Phobia: కూరగాయలు, ఆహారం చూస్తే చాలు వణికిపోతుంది

14 Oct, 2021 11:06 IST|Sakshi

వింత ఫోబియాతో బాధపడుతున్న ఇంగ్లండ్‌ మహిళ

30 ఏళ్లుగా కూరగాయలు ముట్టని వైనం

లండన్‌: మనం ఇంత కష్టపడి సంపాదించేంది ఎందుకు జానెడు పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే. కుబేరుడైనా సరే ఆకలేస్తే తినేది అన్నమే. మనిషి బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో ఆహారం ప్రముఖ పాత్రం పోషిస్తుంది. అలాంటిది ఆహారాన్ని చూస్తేనే భయంతో చెమట పడితే. తిండి చూస్తే.. చెమట పట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇది వాస్తవం. ఓ మహిళ ఇలాంటి వింత ఫోబియాతోనే బాధపడుతుంది. సాస్‌ వేసి ఉన్న ఆహారాన్ని చూసిన.. వేర్వేరు పదార్థాలను కలిపి వండినా, వడ్డించినా.. తప్పుడు పద్దతిలో వడ్డించినా, కూరగాయాలు చూసినా ఆమెకు చెమటలు పడతాయట. ప్రస్తుతం ఆమె కేవలం టమాటా సూప్‌ తాగుతూ బతికేస్తుంది. ఆ వివరాలు..

ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్(34) తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదట. గత కొన్నేళ్లుగా ఆమె రైస్‌ కేక్‌, టమాట సూప్‌ తాగుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. బాల్యం నుంచి కూడా షార్లెట్‌ సరిగా తినేది కాదట. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని భావించేవారు మొదట్లో. బలవంతంగా ఏదైనా తిందామని ప్రయత్నిస్తే.. వాంతికి అయ్యేదట. 
(చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!)

రాను రాను ఈ పరిస్థితి మరింత తీవ్ర కాసాగింది. సాస్‌ వేసిన ఆహారం చూసినా.. మిల్క్‌ షేక్‌లు, వేర్వేరు ఫుడ్‌ ఐటమ్స్‌ని కలిపి వడ్డించినా షార్లెట్‌కి నచ్చేది కాదు. ఇలాంటి ఆహారాన్ని చూస్తే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేవి. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరుగుతుంది.. తప్ప దాని మీద ఇష్టం కలగడం లేదు. ఈ క్రమంలో షార్లెట్‌ తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు.

డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్‌ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్‌ స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తినేది కాదు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల వద్దే ఉండేది కాబట్టి.. ఈ ఫోబియా వల్ల షార్లెట్‌ పెద్దగా ఇబ్బంది పడలేదు. 
(చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..)

చదువు పూర్తయిన తర్వాత షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి వంట చేసి పెడతారు. మొదట ఆ భోజనం చూసి షార్లెట్‌ చాలా భయపడేది. తర్వాత ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తానే వండుకోసాగింది. 

ఈ సందర్భంగా షార్లెట్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి కూరగాయలు చూస్తే నాకు భయం వేసేది. ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తే వాంతికి వచ్చేది. పెరుగుతున్న కొద్ది భయం కూడా పెరగసాగింది. ఇప్పుడు ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా నాకు కడుపులో దేవేస్తుంది. ప్రస్తుతం నేను రైస్‌ కేక్‌, టమాటా సూప్‌ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫోబియా నా సోషల్‌ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతున్నాను. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బలంగా కోరుకుంటున్నాను.. ప్రయత్న ప్రారంభించాను.. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తాను’’ అని తెలిపింది. 

చదవండి: సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..

మరిన్ని వార్తలు