బోర్‌ కొడుతోందని.. చావును పెంచి పోషిస్తున్నాడు

2 Nov, 2022 21:21 IST|Sakshi

బోర్‌డమ్‌ను అధిగమించడానికి మనిషి ముందు మార్గాలెన్నో ఉన్నాయి. ఒక్కోసారి వాటిలో కొన్ని విచిత్రంగా కూడా అనిపించొచ్చు. కానీ, విసుగును పొగొట్టుకునేందుకు ఇక్కడో వ్యక్తి ఏకంగా తన ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నాడు. 

బ్రిటన్‌ వ్యక్తి డేనియల్‌ ఎమీలైన్‌ జోన్స్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాకరమైన స్టంట్‌ ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. విసుగును దూరం చేసుకునేందుకు ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు అతను.  డెండ్రోస్నైడ్‌ మోరోయిడెస్‌.. ఆ మొక్కను ముద్దుగా జింపీ-జింపీ అని పిలుస్తారు. సూసైడ్‌ప్లాంట్‌గా దీనికి మరో పేరు కూడా ఉంది. దానికి ఉండే ముళ్లు గనుక గుచ్చుకుంటే.. ఆ నొప్పి కొన్ని నెలలపాటు ఉంటుంది. అంతేకాదు.. ఆ మొక్క ఒకరకమైన వాతావరణం సృష్టిస్తుంది. అందులో ఉంటే.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతాయంట.

జింపీ-జింపీకి ఆస్ట్రేలియన్‌ స్టింగింగ్‌ ట్రీ అనే పేరు కూడా ఉంది. దీనిని అత్యంత విషపూరితమైన మొక్కగా వ్యవహరిస్తుంటారు. దాని ముళ్లు గనుక గుచ్చుకుంటే ఒకేసారి యాసిడ్‌ మీద పడినట్లు.. షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంటుంది. డేనియల్‌.. ఆక్స్‌ఫర్డ్‌లో పని చేసే ఓ ట్యూటర్‌. తనకు విసుగు పెట్టి.. అది దూరం చేసుకునేందుకే ఆ మొక్కను పెంచుతున్నాడట. ఇందుకోసం ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకున్నాడు. 

తన బోర్‌డమ్‌ను దూరం చేసుకునేందుకు ఇలా ‍ ప్రమాదకరమైన మొక్కను తెచ్చుకుని.. చాలా జాగ్రత్తగా దానిని పెంచుతూ విసుగును పొగట్టుకుంటున్నాడట డేనియల్‌!.

మరిన్ని వార్తలు