కష్టకాలంలో ఉక్రెయిన్‌కు భారీ సాయం.. కానీ, షరతులు వర్తిస్తాయి

18 May, 2022 20:17 IST|Sakshi

యుద్ధకాలంలో ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటన వెలువడింది. కానీ, ఈ సాయాన్ని షరతుల మేరకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈయూ. ఈ మేరకు ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కి  తొమ్మిది బిలియన్‌ యూరోల(రూ. 73 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి రుణ రూపంలో ఈ సాయాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తదనంతరం ఈయూ సాయంతో ఉక్రెయిన్‌ను పునర్‌నిర్మించడం పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారామె. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఈయూ వ్యూత్మక నాయకత్వం వహించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మిగతా దేశాలు కూడా ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈయూ నిబంధనలకు లోబడే ఈ సాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం అనేది.. గత కొన్నిసంవత్సరాలుగా రక్షణ కోసం కేటాయిస్తున్న తక్కువ వ్యయం పై దృష్టి కేం‍ద్రీకరించేలా చేసిందన్నారు. ఆయుధాల ఉత్పత్తి, జాయింట్ ప్రొక్యూర్‌మెంట్‌ను మరింత మెరుగ్గా సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

అంతేకాదు యూరప్‌ కంపెనీలను ఆ మార్గంలో పయనించేలా ఆర్థిక పన్ను ప్రోత్సాహాకాలను అందిస్తామని చెప్పారు. ఇది ఈయూ స్వతంత్ర శక్తి సామర్థ్యాలను బలపరుస్తుందన్నారు. అలాగే ఇంధన సరఫరాలపై రష్యా పై ఆధారపడకుండా చౌకగా, వేగవంతంగా ఇంధనాన్ని పోందే దిశగా అడుగులు వేస్తోంది. అదీగాక ఇప్పటికే ఈయూ యూరోపియన్లను థర్మోస్టాట్‌లను తగ్గించాలని, లైట్లను ఆపివేయాలని, ప్రజారవాణ వినియోగించమని సూచించింది కూడా.

(చదవండి: సీ’దదీరుతూ....అండర్‌ వాటర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌)

మరిన్ని వార్తలు