Ukraine Russia War: రష్యా అనుహ్య నిర్ణయం...తగ్గమని ఈయూ వేడుకోలు

30 Oct, 2022 16:58 IST|Sakshi

ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసే షాకింగ్‌ నిర్ణయాన్ని రష్యా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో యూరోపియన్‌ యూనియన్‌ దయచేసి ఈ విషయంలో వెనక్కి తగ్గమంటూ వేడుకున్నాయి. ఈ మేరకు రష్యాను మధ్యవర్తిత్వ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఈయూ పిలుపునిచ్చింది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే ఉక్రెయిన్‌ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయింది.

ఐతే ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకోవడంతో ఉక్రెయిన్‌ నుంచి ఎగుమతులకు రష్యా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు రష్యా అనుహ్యంగా నల్లసముద్రం ఒప్పందంలో భాగస్వామ్యాన్ని నిలిపేస్తున్నట్లు నిర్ణయించడంతో ప్రపంచదేశాలు ఆందోళ చెందుతున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపకరించింది.

ఐతే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దేశాల ఆగ్రహాన్ని రేకెత్తించే చర్య. పైగా మాస్కో ఇది తన ప్రధాన నౌకదళంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి ప్రతీకార చర్య అని చెబుతోంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన ధాన్యం, ఎరువులకు సంబంధించిన ప్రధాన ఎగుమతిని ప్రమాదంలో పడేస్తుందని ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెట్‌ ట్విట్టర్‌ తెలిపారు. అందువల్ల రష్యాను దయచేసి ఈ విషయంలో వెనక్కితగ్గమని జోసెఫ్‌ కోరారు. 

(చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా)

మరిన్ని వార్తలు