షాకింగ్‌: పసుపు రంగులోకి మారిన శరీరం!

3 Feb, 2021 18:57 IST|Sakshi

బీజింగ్‌ : దీర్ఘకాలంగా పొగ తాగుతున్న ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. స్మోకింగ్‌ వల్ల ఏర్పడిన ట్యూమర్‌ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పాంక్రియాస్‌లో ఏర్పడిన కణతి దుష్ప్రభావం కారణంగా కామెర్లు వచ్చి శరీరం మొత్తం ముదురు పసుపు పచ్చ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చైనీస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. (నకిలీ వ్యాక్సిన్లు అమ్ముతున్న చైనా ముఠా)

వివరాలు... డూ అనే ఇంటిపేరు గల 60 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్‌కు బానిసగా మారాడు. గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజూ సిగరెట్లు కాలుస్తున్న అతడికి ఇటీవల ఆరోగ్యం పాడైంది. దీంతో జనవరి 27న ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడికి కామెర్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు. పొగతాగడం వల్ల ఏర్పడిన కారణంగా కణితి కారణంగా చిన్నపేగు, కాలేయం గుండా వెళ్లే నాళాలు మూసుకుపోయినట్లు పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో రక్తంలో బిలిరూబిన్‌(పసుపు రంగులో ఉండే పైత్యరసం) స్థాయి పెరిగి కామెర్లు వచ్చాయి. 

ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల ట్యూమర్‌ ఏర్పడిందని, దాని ప్రభావం అనారోగ్యానికి దారి తీసిందని తెలిపారు. అతడి శరీరంలో ఉన్న కాన్సన్‌ కణితిని తొలగించామని, ఈ క్రమంలో చర్మం రంగు తిరిగి సాధారణ రంగులోకి మారిందని తెలిపారు. దురలవాట్లు మానుకోకపోతే డూ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈసారి ఆయనను కాపాడటం కష్టమేనని పేర్కొన్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు