మానవ బాంబు విధ్వంసం.. 50 మంది దుర్మరణం

30 Apr, 2022 09:12 IST|Sakshi

బాంబు దాడులతో అప్ఘనిస్తాన్‌ అట్టుకుడుతోంది. తాజాగా అప్ఘన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్‌ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు. మరో వందమంది గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని అప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. కాగా, రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్‌ మసీదులో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. నమాజ్‌ ముగుస్తుందన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. 

దీంతో ఒక్కసారిగా మసీదులో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే కనిపించారని స్థానికులు తెలిపారు. అప్పటికే ప్రార్ధన చేస్తున్నవారిలో కలిసిపోయిన మానవబాంబు తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు. కాగా, ఈ మానవ బాంబుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. గతవారం మజర్‌ ఈ షెరీఫ్‌ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం

మరిన్ని వార్తలు