ట్రంప్‌ పోస్ట్‌ను తొలగించిన ఫేస్‌బుక్‌

6 Aug, 2020 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో తమ సైట్‌లో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ విషయంలో భయాన్ని సృష్టిస్తున్న, తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిని సైట్‌ నుంచి ఫేస్‌బుక్‌ వెంటనే తొలగిస్తోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది.

ట్రంప్‌ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది. అందుకే ఆయన పోస్ట్‌ను తొలగించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ గురించి ట్రంప్‌ ఇచ్చిన సమాచారం హానికరమని, అందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది. దేశాధ్యక్షుడి పోస్ట్‌ను పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి. చదవండి: ఇది భయంకరమైన దాడిలా ఉంది: ట్రంప్‌

మరిన్ని వార్తలు