నిర్వహణలో లోపాలతోనే ఫేస్‌బుక్‌ డౌన్‌

7 Oct, 2021 05:06 IST|Sakshi

లండన్‌: ఫేస్‌బుక్‌ దానికి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని గంటలు పని చెయ్యకపోవడానికి నిర్వహణ సమస్యలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ పని చెయ్యకపోవడానికి కారణం సంస్థలో జరిగే తప్పిదాలేనని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్‌ జనార్ధన్‌ తన బ్లాగ్‌ స్పాట్‌లో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌కి చెందిన కంప్యూటర్లు, రౌటర్లు, డేటా సెంటర్లు, కనెక్టింగ్‌ కేబుల్స్‌ని ఇంజనీర్లు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారని ఆ సమయంలో జరిగిన తప్పిదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల సేపు సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ‘‘ప్రతీ రోజూ ఇంజనీర్లు చేసే నిర్వహణలో భాగంగానే ఒక కమాండ్‌ ఇచ్చారు. అయితే ఎవరూ ఊహిం చని విధంగా దాని వల్ల నెట్‌వర్క్‌ మొత్తం డౌన్‌ అయింది’’ అని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు