రియల్‌ వరల్డ్‌లోకి ఫేస్‌బుక్‌! భారీ ఖర్చుతో సిటీ నిర్మాణం

9 Jul, 2021 11:50 IST|Sakshi

Facebook City వర్చువల్‌ వరల్డ్‌లో 2.9 బిలియన్ల యూజర్లతో సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది ఫేస్‌బుక్‌. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌ రియాలిటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సిలికాన్‌ వ్యాలీలోని తమ హెడ్‌ క్వార్టర్స్‌కు దగ్గర్లో ‘రియల్‌లైఫ్‌’ కమ్యూనిటీ కోసం ఒక పెద్ద నగరాన్ని నిర్మించబోతోంది. సుమారు 1700 అపార్ట్‌మెంట్లతో ‘విల్లో సిటీ’ పేరుతో  డెవలప్‌ చేయబోతోంది. 

కాలిఫోర్నియా: ప్రస్తుతం మెన్లో పార్క్‌లో ఫేస్‌బుక్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థలంలోనే ఫేస్‌బుక్‌కు మరికొన్ని సొంత బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇక కొత్తగా 59 ఎకరాల స్థలంలో విల్లో సిటీని డెవలప్‌ చేయబోతోంది. 1,729 అపార్ట్‌మెంట్‌లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్‌, సూపర్‌ మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కొత్త ఆఫీస్‌లను కట్టించనుంది. సిగ్నేచర్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌తో కలిసి ఫేస్‌బుక్‌ ఈ సిటీని నిర్మించబోతోంది.

విల్లో సిటీ పార్క్‌ ఊహాత్మక చిత్రం

ఎంప్లాయిస్‌కు వసతి?
నివాస యోగ్యంగా 320 అపార్ట్‌మెంట్లు, సీనియర్ల కోసం మరో 120  కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఒక ఫార్మసీ, కేఫ్‌, న్యూయార్క్‌ సిటీ టౌన్‌ స్క్వేర్‌ తరహా నిర్మాణం.. ఓ భారీ పార్క్‌ నిర్మించనుంది. ఇక ఉద్యోగులు కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చని, పర్మినెంట్‌ జీతగాళ్లకు ఈ ఆఫర్‌ ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది.  వీటితో పాటు కొత్త ఆఫీస్‌ బిల్డింగ్‌, మీటింగ్‌, కాన్ఫరెన్స్‌ రూంలు కూడా కట్టించనుంది. అయితే కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మందికి స్థానం కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆ ఆఫీస్‌ ప్రాంగణంలో కేవలం ఫేస్‌బుక్‌ ఎంప్లాయిస్‌ మాత్రమే సంచరించేందుకు అనుమతి ఇస్తారు.

అందరికీ ఇవ్వకపోవచ్చు
బెల్లె హవెన్‌, ఈస్ట్‌ పాలో అల్టో మధ్య విల్లో సిటీ నిర్మించబోతున్నారు.  గతంలో ఫేస్‌బుక్‌.. పది మైళ్లలోపు నివసించే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇస్తామని ప్రకటించిన వియం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్‌ అందరికీ నివాస సౌకర్యం కల్పించపోవచ్చని భావిస్తున్నారు. ఎకరంన్నర స్థలంలో టౌన్‌ స్క్వేర్‌ దాని చుట్టూ కమర్షియల్‌ కాంప్లెక్స్‌,  నాలుగు ఎకరాల్లో పబ్లిక్‌పార్క్‌, దాని చుట్టూ రెండు ఎకరాలలో ఓపెన్‌ స్పేస్‌లు నిర్మించనుంది ఫేస్‌బుక్‌.

ఇంతకుముందు ఓ భారీ టెక్‌ పార్క్‌ కోసం 2017లోనే ఫేస్‌బుక్‌ ఓ అప్లికేషన్‌ సమర్పించినా.. ఇప్పుడు అంకు మించి స్థాయిలోనే రియాలిటీ వరల్డ్‌లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే గూగుల్‌ కూడా కిందటి ఏడాది శాన్‌ జోస్‌(కాలిఫోర్నియా)లో నాలుగు వేల అపార్ట్‌మెంట్‌లతో డౌన్‌టౌన్‌ వెస్ట్‌ పేరిట ఒక సిటీని డెవలప్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు