జూమ్​ మధ్యలో అసభ్యంగా తాకడం.. ఇదీ అసలు విషయం

4 Jun, 2021 14:18 IST|Sakshi

బాకు: ‘‘లైవ్​లో ఉన్న సంగతి మర్చిపోయి మరీ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్’’​.. ఈ క్యాప్షన్​తో ఓ వీడియో ఈమధ్య ఫేస్​బుక్​లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్​సైట్స్​, టాబ్లాయిడ్స్​ అసదోవ్​ తీరును తప్పుబడుతూ ఆ వార్తను ప్రచురించేశాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి ఓ ట్విస్ట్​ ఇప్పుడు బయటపడింది. అందులో ఉంది ఆయన కాదంటూ అసలు విషయం తెలిసొచ్చింది.

వీడియోలో ఏముందంటే.. 
జూమ్ మీటింగ్​ జరుగుతుండగా.. అందులో పెద్దాయన సడన్​గా వెనక్కి తిరుగుతాడు. అక్కడే ఉన్న ఓ మహిళ వెనుక భాగాన్ని తన చేత్తో తాకుతాడు. దీంతో ఉలిక్కి పడ్డ ఆ మహిళ.. ఆయనతో వాగ్వాదానికి దిగుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది. వెంటనే ఆయన కెమెరా ఆఫ్​ చేస్తాడు. అయితే కొందరు ఫేస్​బుక్​ యూజర్లు.. ఇది అజర్​ బైజాన్​ అధ్యక్షుడి పనే అని, కాదు ప్రధాని అలీ అసదోవ్​ పనే అని మరికొందరు ప్రచారం చేశారు చేశారు. జూమ్ మీటింగ్​కు ఎగ్జిట్ కొట్టని సంగతి మరిచి.. అలా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అయితే అందులో ఉంది అజర్​ బైజాన్​ అధ్యక్షుడో, ప్రధానో కాదని ఇప్పుడు తేలింది.

పాత వీడియో కానీ.. 
మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అజర్ బైజాన్​ మాజీ ఎంపీ, యూనివర్సిటీ ప్రొఫెసర్​ హుసేయిన్బలా మిరాలమోవ్​. పోయిన నెలలో ఆయన ఈ పాడు పనికి పాల్పడ్డాడు. పైగా ఈ వీడియో రిలీజ్ అయ్యి నెలపైనే అయితోంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా,  ఆయన్ని న్యూ అజర్​ బైజాన్​ పార్టీ బహిష్కరించింది కూడా. అయితే ఈ వ్యవహారం అధికారిక జూమ్​ మీటింగ్​లోనే జరగడం విశేషం. ఇక పోలికలు కూడా పట్టించుకోకుండా కథనాలు ప్రచురించిన వెబ్​సైట్లపై దావాకు అజర్​ బైజాన్​ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   చదవండి: మనిషికి బర్డ్​ఫ్లూ.. ఇది అసలు విషయం

మరిన్ని వార్తలు