7 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఎఫెక్ట్స్‌ అన్న బిల్‌గేట్స్‌?

21 Jan, 2021 16:54 IST|Sakshi

వాషింగ్టన్‌:  పలు చోట్ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆస్పత్రిపాలు అవుతుండటంతో జనాలు వ్యాక్సిన్‌ అంటేనే జంకుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ వల్ల ఏడు లక్షల మంది చావడమో లేదా వికలాంగులుగా మారడమో జరుగుతుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో చాలా మంది బిల్‌గేట్స్‌ చెప్పింది నిజమేనేమోనని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు, టీకా వేయించుకోవద్దని సూచిస్తూ స్నేహితులకు, సన్నిహితులకు సదరు పోస్టును షేర్‌ చేస్తున్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్ ‌తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా)

కానీ వ్యాక్సిన్‌ తీసుకుంటే చనిపోతారని బిల్‌గేట్స్‌ ఎక్కడా చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి మాట్లాడుతూ.. టీకా తీసుకోవడం వల్ల సుమారు ఏడు లక్షల మందికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే తప్ప టీకా వారికి దీర్ఘకాలంగా హానీ తలపెడుతుందనో, లక్షల మంది మరణిస్తారనో చెప్పలేదు. కాబట్టి ఇది ఫేక్‌ న్యూస్‌. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్లు ఉంటాయని చెప్పింది. కానీ అవి కొద్ది రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయని పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. 14 రకాలు)

క్లారిటీ: కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఏడు లక్షల మంది వైకల్యానికి గురి కావడం లేదా ప్రాణాలు విడుస్తారని బిల్‌గేట్స్‌ చెప్పలేదు.

>
మరిన్ని వార్తలు