Time Cover Photo: పుతిన్‌ను హిట్లర్‌తో పోలుస్తూ టైమ్‌ కవర్‌ ఫొటోలు!! ఇదీ అసలు కథ

1 Mar, 2022 09:02 IST|Sakshi

Fact Check On Putin Face With Hitler On Time Cover: ఉరుము ఉరిమి మంగలం (మట్టిపాత్ర) మీద పడ్డట్లు.. నాటో చేరిక అభ్యంతరాలను చూపుతూ ఉక్రెయిన్‌పై రష్యా తన ప్రతాపం చూపిస్తోంది. అందుకే ఉక్రెయిన్‌ దీనస్థితిని చూసి జనాలంతా జాలిపడుతున్నారు. శక్తివంతమైన తమ బలగాలను ఉక్రెయిన్‌ అడ్డుకుంటుండడంతో.. ఆ కోపం పౌరులపై చూపిస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఈ మారణహోమానికి కారకుడైన పుతిన్‌ను యావత్‌ ప్రపంచం ముక్తకంఠంతో తిట్టిపోస్తోంది.


టైమ్‌ మ్యాగజైన్‌ సైతం తన లేటెస్ట్‌ ఎడిషన్‌ ‘రి రిటర్న్‌ ఆఫ్‌ హిస్టరీ.. హౌ పుతిన్‌ షట్టర్డ్‌ యూరోప్స్‌ డ్రీమ్స్‌’ పేరిట కవర్‌ స్టోరీని పబ్లిష్‌ చేసింది. దానిపై పుతిన్‌, జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ఫేస్‌తో కలగలిసిన కవర్‌ చిత్రం ఉండడం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది.  కళ్లతో పాటు, హిట్లర్‌ మీసాలు సైతం  పుతిన్‌కు అన్వయింపజేసి ఆ కవర్‌ చిత్రాలను ప్రచురించినట్లు  కనిపిస్తోంది. అయితే.. 

టైమ్‌ మ్యాగజైన్‌ ఇలా రెండు ఫొటోలతో కవర్‌ పేజీలను ప్రచురించిన దాఖలాలు లేవ్‌!. అందుకే క్రాస్‌ చెక్‌ కోసం ఫ్యాక్ట్‌ చెక్‌ ప్రయత్నించగా.. ఆ ఫొటోలు ఫేక్‌ అని తేలింది. ఒరిజినల్‌ టైం అదే టైటిల్‌తో కవర్‌ స్టోరీని మార్చి 14-21 ఎడిషన్‌ కోసం తీసుకొచ్చింది. దానిపై ఫొటో జర్మనీ యుద్ధ ట్యాంకర్‌ ఫొటోను పబ్లిష్‌ ​చేసింది.

అయితే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఫొటోలు మాత్రం ఫిబ్రవరి 28-మార్చి 7వ తేదీల పేరిట వైరల్‌ అవుతున్నాయి. 

గ్రాఫిక్‌ డిజైనర్‌ ప్యాట్రిక్‌ మల్డర్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సందర్భంగా ఈ ఇమేజ్‌లను క్రియేట్‌ చేశాడట. తద్వారా జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది ఇలా మరోలా జనాల్లోకి వెళ్లింది.

మరిన్ని వార్తలు