విద్యార్థులు ద‌గ్గినా, తుమ్మినా శిక్ష‌!

1 Sep, 2020 08:18 IST|Sakshi
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

లండన్: ఇప్ప‌ట్లో కోవిడ్ ద‌శ ముగిసే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దీంతో ఎన్నాళ్ల‌ని లాక్‌డౌన్ అంటూ భ‌యంతో బ‌తుకు వెళ్ల‌దీయ‌డం అని ఒక్కొక్క‌టిగా అన్నిర‌కాల‌ కార్య‌క‌లాపాల‌ను తెరుచుకునేందుకు అనుమ‌తులు ఇస్తున్నారు. అందులో భాగంగానే బ‌డుల‌కు కూడాఆ ప‌చ్చ‌జెండా ఊపుతున్నారు. దీంతో యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో నిన్న‌టి నుంచే స్కూళ్లు పున‌: ప‌్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా తూర్పు స‌సెక్స్‌లోని ఆర్క్ అలెక్జాండ్ర అకాడ‌మీ క‌రోనా వైర‌స్ రెడ్ లైన్స్ పేరిట‌‌ ప్రత్యేక నిబంధ‌న‌లను రూపొందించింది. "విద్యార్థులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ద‌గ్గకూడ‌దు, తుమ్మ‌కూడ‌దు. క‌రోనా గురించి ఎవ‌రూ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌రాదు. వ్య‌క్తికి వ్య‌క్తికి మ‌ధ్య క‌నీస దూరం ఉండాల్సిందే. (చ‌ద‌వండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?)

ఈ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించే విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. వారిని స్కూలు నుంచి ఇంటికి పంపించేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు" అని పాఠ‌శాల యాజ‌మాన్యం హెచ్చ‌రించింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ద‌గ్గు రాక‌పోయినా స‌రే దగ్గుతూ న‌టించినా, క‌రోనా మీద కుళ్లు జోకులు వేసినా వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు. క‌ఠినంగా అనిపిస్తోన్న ఈ నిబంధ‌న‌లను పిల్ల‌లు అల‌వాటు చేసుకుంటారో, లేదా రూల్స్ అతిక్ర‌మించి ప‌నిష్మెంట్ తీసుకుంటారో! కాగా వీటితో పాటు ప్ర‌భుత్వం ఆదేశించిన నిబంధ‌న‌ల‌ను కూడా విద్యార్థులు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, ఒక‌రికి మ‌రొక‌రికి మ‌ధ్య‌ భౌతిక‌దూరం పాటించ‌డం వంటివి త‌ప్ప‌నిస‌రి. (చ‌ద‌వండి: ‘టీసీ’ లేకున్నా అడ్మిషన్‌..)

మరిన్ని వార్తలు