వైరల్‌: వ్యాక్సిన్‌ వేయకుండానే వేసినట్లు నాటకం..

28 Apr, 2021 15:34 IST|Sakshi

కరోనా రెండో దశ సునామీలా దూసుకొస్తుంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహమ్మారి కట్టడికి మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు అర్హులైన వారందరూ వ్యాక్సిన్‌ తప్పనిసరి వేసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మొదట్లో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు భయంతో కాస్తా వెనకడుగు వేసినా.. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సాగుతోంది. తాజాగా ఫేక్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఓవార్త నెట్టింట్లో వైరలవుతోంది. 

ఓ వ్యక్తి కోవిడ్‌ టీకా కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అయితే ఓ నర్సు వ్యాక్సిన్‌ వేయకుండానే వేసినట్లు నాటకమడింది. వ్యాక్సిన్‌ కోసం కూర్చున్న వ్యక్తికి ముందుగా కాటన్‌తో క్లీన్‌ చేసింది. తరువాత సూదిని వ్యక్తి భుజానికి గుచ్చింది కానీ వ్యాక్సిన్‌ ఇంజెక్ట్‌ మాత్రం చేయకుండానే సిరంజ్‌ను తీసేసింది. నర్సు ఇలా చేసిన విషయం సదరు వ్యక్తికి తెలియదు. టీకా తీసుకున్నట్లే భావించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో దీనిని చూసిన జనాలంతా వైద్య సిబ్బందిపై మండిపడ్డుతున్నారు. ‘ఛీ.. ఓ వైపు కరోనాతో చస్తుంటే టీకా విషయంలో ఇలాంటి మోసాలేంటి’ అని విరుచుకుపడుతున్నారు. అయితే ఇది జరిగింది భారత్‌లో కాదు.. మెక్సీకో దేశంలో.

చదవండి: గుడ్‌న్యూస్‌.. కోవాగ్జిన్‌తోనే సెకండ్‌ వేవ్‌ కట్టడి 

మరిన్ని వార్తలు