సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

26 Oct, 2021 17:38 IST|Sakshi

న్యూయార్క్‌: కొంత మంది ఒకే తేదిన లేదా ఒకే రోజున అక్కా తమ్ముళు పుట్టడం తరుచుగా వినే ఉంటాం. అలాగే కొంతమంది నాన్న లేదా అమ్మ పుట్టిన తేదినే పిల్లలు పుట్టడం కూడా చూసుంటాం. కానీ చాలా అత్యంత అరుదుగా సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిన జన్మించడం జరుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం యూఎస్‌కి చెందిన ఒక జంటకు ఎదురైంది. అంతేకాదు ఈ జంటకి మూడేసి సంత్సారాల తేడాతో ఒకే నెల ఒకే రోజు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు.

(చదవండి: దయచేసి ఫోన్‌ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!)

వివరాల్లోకెళ్లితే...క్రిస్టిన్ లామెర్ట్ సంవత్సరాల తేడాతో ఆగస్టు 25న తన ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. మొదటి పాప సోఫియా ఇచ్చిన డెలివరీ తేది 2015 ఆగస్టు 23 అయితే రెండు రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 25న జన్మించింది. రెండో పాప గియులియానాకి ఇచ్చిన డెలివరీ తేది  2018 ఆగస్టు 29 అయితే నాలుగు రోజులు ముందుగా ఆగస్టు 25న పుట్టింది. ఇక మూడో పాప మియా కూడా అనుహ్యంగా డెలివరీకి ఇచ్చిన తేది 2020 సెప్టెంబర్‌ 8 అయితే 14 రోజులకు ముందుంగా అదే తేదిన జన్మించింది.

ఇలా చాలా అ‍త్యంత అరుదుగా సంభవిస్తుంది. ఈ మేరకు ఆ ముగ్గురి బిడ్డల తల్లి క్రిస్టిన్ తాము ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు కానీ ఇది తమకు అత్యంత ప్రత్యేకం అంటూ ఆనందం వ్యకం చేసింది. అంతేకాదు ఆమె భర్త మిన్నెసోటా యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ అయిన రాబ్ వారెన్  మాట్లాడుతూ..."ముగ్గురు సంవత్సరాల తేడాతో జన్మిస్తారని అనుకున్నాం కానీ ఇలా ఒకే నెల ఒకే తేదిన జన్మిస్తారని ఊహించలేదు. పైగా అందుకోసం ఎటువంటి ప్లాన్‌ చేయలేదు." అంటూ చెప్పుకొచ్చాడు.

(చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!)

మరిన్ని వార్తలు