Viral Video: ప్రేమతో... మీ నాన్న ... గిఫ్ట్‌గా లంబోర్గిని

5 Jun, 2021 17:55 IST|Sakshi

65 రోజుల్లో కారు తయారు చేసిన తండ్రి

హైబ్రిడ్‌ లంబోర్గిని సూపర్‌ స్పోర్ట్స్‌ కార్‌

కారు తయారీకి కలప వినియోగం

గంటకు 25 కి.మీ వేగంతో నడిచే బుల్లి కారు 

హనోయి(వియత్నాం): కొడుకు అడిగిందే ఆలస్యం అతని కోసం లంబోర్గిని కారును గిఫ్టుగా ఇచ్చాడు తండ్రి. అయితే ఆ కొడుకు వయసు కేవలం ఐదేళ్లు. అందుకుని కోట్లు పోసి షోరూంలో కారును కొనలేదు, 65 రోజులు శ్రమించి కొడుక్కి తగ్గట్టుగా వుడెన్‌ కారుతు తయారు చేసి తండ్రి తన  ప్రేమను చాటుకున్నాడు.

కొడుకు అడిగితే
వియత్నాంకి చెందిన ట్రూంగ్‌ వాన్‌ డోవ్‌ కార్పెంటర్‌ పనిలో దిట్ట. అదే అతని జీవనాధారం. కార్పెంటర్‌ పనితో పాటు సాంకేతిక అంశాలపైనా తనకు పట్టుంది. దీంతో వడ్రంగి పనికి సాంకేతిక జోడించి కొత్తకొత్త డిజైన్లు చేస్తుండేవాడు. ఒకరోజు టీవీలో లంబోర్గిని కారును చూసి, అది కావాలని అడిగాడు అతని కొడుకు. 

65 రోజుల శ్రమ
కుమారుడు అడగటమే ఆలస్యం రంగంలోకి దిగిపోయాడు ట్రూంగ్‌ వాన్‌ డోవ్‌. వెంటనే కారు తయారీకి అవసరమైన వస్తువులు తెచ్చేశాడు. మొదటగా కారు బేస్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత చక్రాలు తిరిగేందుకు అనువుగా కారు బాడీని రెడీ చేశాడు. ఆ తర్వాత అచ్చం లంబోర్గిని సియాన్‌ రోస్టర్‌ తరహాలో ముందు, వెనుక భాగంలో డిజైన్‌ సిద్ధం చేశాడు. కారు కదిలేందుకు వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్‌ మోటార్లు అమర్చాడు. దీంతో ఈ బుల్లి లంబోర్గిని కారు గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదని ట్రూంగ్‌ చెబుతున్నాడు. 

ఫిదా
కారు తయారీకి సంబంధించిన వీడియోతో పాటు కారులో ట్రూంగ్‌ అతని కొడుకు వియత్నాం విధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు ట్రూంగ్‌. కొడుకుపై అతని ప్రేమకు, కొడుకు ముచ్చట తీర్చేందుకు అతడు పడ్డ శ్రమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 


 

మరిన్ని వార్తలు