Steve jobs: ఫాదర్‌ ఆఫ్‌ ది డిజిటల్‌ రెవల్యూషన్‌ గుడ్‌ బై స్పీచ్‌ విన్నారా?

5 Oct, 2021 10:48 IST|Sakshi

ఫాదర్‌ ఆఫ్‌ ది డిజిటల్‌ రెవల్యూషన్‌ స్టీవ్‌ జాబ్స్‌ డెత్‌  యానివర్శిరీ

సాక్షి, హైదరాబాద్‌:  కంప్యూటర్‌ మాంత్రికుడు, ఫాదర్‌ ఆఫ్‌ ది డిజిటల్‌ రెవల్యూషన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ఘనత ఆయనది. ఎవరి పేరు చెబితే స్మార్ట్‌ఫోన్ రంగంలో గొప్ప బ్రాండ్‌ ఇమేజ్‌ గుర్తు వస్తుందో ఆయనే ప్రపంచంలోనే పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు,  ఆపిల్ మాజీ చైర్మన్, సీఈఓ  స్టీవ్ పాల్ జాబ్స్ . టెక్‌ ప్రియులను విషాదంలో ముంచేస్తూ అక్టోబరు 5న స్టీవ్‌ జాబ్స్‌ కన్నుమూశారు.  ఈ సందర్భంగా స్పెషల్‌ స్టోరీ.

ఒక్కరోజులో  స్టీవ్‌ జాబ్స్‌ ఈ కీర్తిని సంపాదించలేదు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి అంతకన్నా కాదు. బాల్యంలో అనేక కష్టాలు పడుతూ, చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది.  ఆ తరువాత కూడా  అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని  ఆపిల్‌ లాంటి కంపెనీని స్థాపించి చరిత్రలో తనకంటూ ఒకస్థానాన్ని మిగిల్చుకున్న వ్యక్తి స్టీవ్‌ జాబ్స్‌. దేశంలోని టాప్ 100 సీఈఓలకు సీఈఓ కోచింగ్ అందించడంలో కీలకపాత్ర,  కేవలం స్టార్టప్‌ కంపెనీలకే కాదు  అనేక కార్పొరేట్‌ కంపెనీలకు ఆయనొక మార్గదర్శకుడు.

శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని ఒక సిరియన్‌ ముస్లిం కుటుంబంలో స్టీవ్ పాల్‌ జాబ్స్ 1955,  ఫిబ్రవరి 24న జన్మించాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పాల్‌, క్లారా దంపతులకు ఆ తరువాత దత్తతకువెళ్లిపోయాడు. ఒకవైపు నచ్చని చదువు, మరోవైపు తల్లితండ్రుల కష్టాల నేపథ్యంలో చదువు శ్రద్ధగా పెట్టలేక పోయాడు. పేపర్‌ బాయ్‌గా పనిచేశాడు. ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లోని గిడ్డంగిలో పనిచేశాడు. అయినా తను అనుకున్న రంగంపై చిత్తశుద్ధితో కఠోర శ్రమ చేసి ఒక లెజెండ్‌గా ఎదిగాడు.

1972లో అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీడ్ కాలేజీలో చేరి, అది నచ్చక దాన్ని వదిలేశాడు. కాలిగ్రఫీ కోర్సు నేర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి నేలపై పడుకునేవాడు.  ఖాళీ  కోక్‌  బాటిల్స్‌ అమ్ముకుని జీవించేవాడు. అంతేకాదు వారానికి ఒకసారయినా కడుపు నిండా భోంచేసేందుకు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ ఇస్కాన్‌ దేవాలయంలో ఉచిత భోజనం తినేవాడు. అలా 1974లో జాబ్స్ అట్టారి ఒక వీడియో గేమ్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, అధిపతి అభిమానాన్ని చూరగొన్నాడు. 15 సంవత్సరాల వయస్సులోనే  ఒక కారునుసొంతం చేసుకున్నాడు.  అదే సంవత్సరంలో, ఉద్యోగాలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఇండియాకు వచ్చాడు. జైన, బౌద్ధమతంపై తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు.  7 నెలలు భారతదేశంలో ఉన్నాడు . పూర్తి శాకాహారిగా మారిపోయాడు. కొంతకాలం తరువాత కాలిఫోర్నియకు వెళ్లిపోయాడు.

జాబ్స్ స్నేహితుడు, క్లాస్‌మేట్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌లంటే ఎంతో ఇష్టమైన స్టీఫెన్ వోజ్నియాకి కలుసుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. 1975 మార్చి 5న, హోమ్‌మేడ్ కంప్యూటర్స్ క్లబ్ సమావేశం, ఆ తరువాత స్టీఫెన్ వోజ్నియాక్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్టీవ్స్‌ను, మినీ బస్సును, వోజ్నియాక్ తకెంతో ఇష్టమైన ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఒక కంపెనీని మొదలు పెట్టారు.  క్లబ్‌లో రెడీమేడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లను విక్రయాలను మొదలు పెట్టారు. 21 ఏళ్ల వయసులో 1976, ఏప్రిల్ 1న కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో  గ్యారేజిలో ఆపిల్‌ పేరుతో  కంపెనీ మొదలు పెట్టారు. అలా  తొలి ఆవిష్కారం "ఆపిల్ కంప్యూటర్" కు భారీ క్రేజ్‌ వచ్చింది.   ఆ తరువాత ఆపిల్‌ 2 రిలీజ్‌ చేశాడు. ఇదొక సంచలనం. తద్వారా కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఆపిల్‌ అవతరించింది. జనవరి 3, 1977లో ఆపిల్ కంప్యూటర్ కంపెనీతో ఆపిల్ కార్పొరేషన్‌గా మారింది. మాకింతోష్‌ కంప్యూటర్లను కూడా రిలీజ్‌ చేశాడు.  పెప్సీ జాన్‌  కెల్లీని  ఆపిల్‌ కంపెనీకి తీసుకురావడంతో ఆపిల్‌ కంపెనీ సీఈవో గారావడం మరింత  దూసుకు పోయింది ఆపిల్‌. ఇంతలో ఆర్థిక మంద్యం ఐబీఎంతో పోటీ,  మరోవైపు బోర్డులో విబేధాలతో  స్టీవ్‌జాబ్స్‌ ఆపిల్‌ కంపెనీకి గుడ్‌ బై చెప్పాల్సి వచ్చింది.

1985లో జాబ్స్‌ NeXT Incని కంప్యూటర్‌ కంపెనీ, సినిమా నిర్మాణ సంస్తలను స్థాపించాడు. ఇక్కడా అనేక విజయాలతోపాటు,  ఇబ్బందులు తప్ప లేదు. చివరికి పోగొట్టుకున్నచోటే వెతుకున్నట్టుగా  కొన్నాళ్లకే ఆపిల్‌ కంపెనీలో తిరిగి చేరిపోయాడు. ఇక అప్పటినుంచి స్టీవ్‌ జాబ్స్‌ వెనుదిరిగి చూసింది లేదు. ఎన్నో వినూత్న, విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికాడు. మొదటి తరం ఐపాడ్ అక్టోబర్ 23, 2001 న విడుదలైంది.  తొలి ఐఫోన్ జనవరి 2007లో వెలుగులోకి వచ్చింది.  అత్యాధునిక ఫీచర్ల ఐపాడ్‌, ఐఫోన్లను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు.  ప్రతి ఇంటికి కంప్యూటర్‌, అదీ చవక ధరలో అన్న  తన  కలను సాకారం దిశగా అడుగులు వేశాడు.

2003లో జాబ్స్ ప్రాణాంతక ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ బారిన పడ్డాడు. ఆరంభంలో ఈ వ్యాధి చికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు జాబ్స్‌. దాదాపు తొమ్మిది నెలలపాటు అపరేషన్‌ చేయించుకోవడానికి నిరాకరించాడు.  కానీ వ్యాధి మరింత ముదరడంతో, జూలై 2004లో, ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ ఆపరేషన్‌ చేసి కణితిని తొలగించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది.జాబ్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. 2009లో, జాబ్స్ తన అనారోగ్యం గురించి అందరికీ తెలియజేయడంతో పాటు తన వ్యాపారాన్ని టిమ్ కుక్‌కి అప్పగించాడు. అనంతరం 2009లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి లివర్‌ డోనేషన్‌ కారణంగా  తను బతికి ఉన్నానని ప్రకటించాడు. అంతేకాదు అందరూ అవయవదానంపై ఆలోచించాలని కూడా  విజ్ఞప్తి చేశాడు.

2010 ప్రారంభంలో తిరిగి పనిలో పడినా అనారోగ్యం కారణాల రీత్యా ఆగస్టు 24, 2011న, జాబ్స్ తన పదవీ విరమణను ప్రకటించాడు. ఫలితంగా ఆయన వారసుడిగా టిమ్ కుక్  రంగంలోకి వచ్చాడు. చివరికి ఎనిమిది సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి  56 ఏళ్ల వయసులో అక్టోబర్ 5, 2011  ఈ లోకాన్ని వీడాడు  జాబ్స్‌.  2011లో ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2011 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్టీవ్ జాబ్స్ నికర ఆస్తులను 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అమెరికా బిలియనీర్ల ర్యాంకింగ్‌లో అతడిని 39 వ స్థానంలో నిలిపింది. 2007లో, ఫార్చ్యూన్ మ్యాగజైన్ జాబ్స్‌ని వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. 2010లో అతను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 17 వ స్థానంలో నిలిచాడు.  2011 లో, స్టీవ్ జాబ్స్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2012 లో, స్టీవ్ జాబ్స్ "మన కాలంలోని గొప్ప పారిశ్రామికవేత్త" గా ఖ్యాతి దక్కించుకున్నాడు. మరణానంతరం గ్రామీ ట్రస్టీస్ అవార్డును అందుకున్నారు. డిస్నీ చిత్రం "జాన్ కార్టర్", పిక్సర్ కార్టూన్ "బ్రేవ్" అతనికి అంకితం ఇచ్చింది.. స్టీవ్ జాబ్స్ గురించి 10 పుస్తకాలు. 6 డాక్యుమెంటరీలు, 3 ఫీచర్ ఫిల్మ్‌లు  రావడం విశేషం.

జాబ్స్‌ వ్యక్తిగత విషయానికి వస్తే స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ విద్యార్థి లారెల్ పావెల్‌ ప్రేమించాడు జాబ్స్‌.  మార్చి 18, 1991 వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు