గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్‌ టీకా నిలిపివేత

14 Apr, 2021 13:34 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంగళవారం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో మెదడులో రక్తం గడ్డగట్టిపోతున్న లక్షణాలు బయటపడటంతో ఆ వ్యాక్సిన్‌ను నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మెదడు నుంచి రక్తాన్ని  తీసుకొచ్చే నాళాల్లో రక్తం గడ్డకడుతోందని, అందులోనూ ప్లేట్‌లెట్లు తక్కువగా ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇవ్వగా, వారిలో 6 మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. యూరోపియన్‌ యూనియన్‌లో సైతం ఆ్రస్టాజెనెకా వ్యాక్సిన్‌తో ఇలాంటి లక్షణాలే కన్పించడంతో వాడకం నిలిపేసిన విషయం తెలిసిందే.

చదవండి: కోవిడ్‌ ఇంకా ముగియలేదు.. 

మరిన్ని వార్తలు