వీడియో: ఫెలిసిటీ పట్టణం గురించి తెలుసా.. అక్కడ ఉండేది కేవలం ఇద్దరే

22 Jun, 2021 10:33 IST|Sakshi

‘ఫెలిసిటీ’ అనే పట్టణం గురించి ఎప్పుడైనా విన్నారా. అసలు అక్కడ ఉండే జనాభా ఎంతో తెలుసా.. ఫెలిసిటీని సెంటర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..ఇవన్నీ తెలియాలంటే అసలు వివరాల్లోకి వెళ్లాలి. అమెరికా కాలిఫోర్నియాలో ఈ ఫెలిసిటీ పట్టణం ఉంది. ఇక్కడి జనాభా కేవలం ఇద్దరే. జాక్వెస్‌ ఆండ్రూ ఇస్తెల్‌, ఆయన భార్య ఫెలిసియా కలిసి 1986లో ఈ పట్టణాన్ని నిర్మించారు. కాయ్‌ అనే పుస్తకం ఆధారంగా దీనిని నిర్మించారు. కాయ్‌ అనేది ఓ డ్రాగన్‌. ప్రపంచ కేంద్రంలో ఉంటుందని ఈ పుస్తకం చెబుతోంది. ఈ పుస్తకాన్ని రాసింది కూడా జాక్వెస్‌యే. ఆయన భార్య పేరు మీదనే ఈ పట్టణానికి పేరు పెట్టారు. ఈ ప్రపంచానికి ఫెలిసిటీయే కేంద్రం. జాక్వెస్‌ ఈ పట్టణానికి మేయర్‌.

ఈ నగరానికి చెందిన ఓ టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీరు విశ్వానికి మధ్యలోఉన్నారా అనే క్యాప్షన్‌తో షేర్‌చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొంచెం ఆశ్చర్యం, భయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో మనల్ని కొద్దిగా భయపెట్టడానికి హాలోవీన్ క్రీపీ సౌండ్ ఎఫెక్టులను వాడారు. అలాగే లిబర్టీ బెల్, ఓ చర్చి, ఓ శ్మశానం వంటివి చూపించారు. ఓ వింత కట్టడం, ఓ మెట్ల నిర్మాణం కూడా కనిపిస్తోంది. 

ఈ పట్టమంలో 21 అడుగుల పొడవైన రాయి, ఓ గ్లాస్ పిరమిడ్ ఉంటుంది. ఓ గ్రానైట్ హిస్టరీ మ్యూజియం ఉంటుంది. ఇలాగే డజన్ల కొద్దీ గ్రానైట్ ప్యానెల్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకూ 100 అడుగుల కంటే పొడవుగా ఉన్నాయి. 1950లో ఈ భూమిని జాక్వెస్‌ కొన్నారు. 1980లో తన పారాచూట్‌ వ్యాపారాన్ని అమ్మేసి.. దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని చేరాలంటే కాలిఫోర్నియా  ఆగ్నేయంగా ఉన్న ఇంటర్‌ స్టేట్‌ 8 ద్వారా చేరుకోవచ్చు. కాలిఫోర్నియా ఇంపెరియల్‌ కౌంటీ, ప్రెంచ్‌ ప్రభుత్వం దీనిని ప్రపంచ కేంద్రంగా గుర్తించారు.

చదవండి: Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు