వైరల్‌: ఇదేందయ్యా ఇది! ఇలా కూడా కొట్లాడొచ్చా...

1 Aug, 2021 13:09 IST|Sakshi
వీడియో దృశ్యం

వాషింగ్టన్‌ : రెండు ఆడ జింకల విచిత్రమైన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా, టెక్సాస్‌లోని సోమర్‌ విల్లే లేక్‌లో చోటుచేసుకున్న ఈ ఫైట్‌ సీన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జింకల యజమాని గే ఇస్బర్‌ మాట్లాడుతూ.. ‘‘ఆడ జింకలు కొట్లాడుకోవటం మొదటి సారి చూస్తున్నా.. అవి అచ్చం ఏలియన్స్‌లాగా కనిపించాయి. జింకలు మామూలుగా స్థలం కోసం గొడవపడుతూ ఉంటాయి’’ అని తెలిపింది. కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

వీడియోలో.. ఓ ఆడ జింక తన మానాన గడ్డి మేస్తోంది. ఇంతలో మరో ఆడ జింక అక్కడికి వచ్చింది. జింక బాషలో ఆ వచ్చిన ఆడ జింక ఏమందో ఏమో కానీ, దాన్ని చూడగానే గడ్డి మేస్తున్న జింక ఠక్కున రెండు కాళ్లపై? పైకి లేచింది. ఆ వెంటనే ఆ వచ్చిన జింక కూడా రెండు కాళ్లపై పైకి లేచింది. ముందు కాళ్లను ఊపుతూ ఒకటి వెనక్కు పోతుంటే.. రెండోది కూడా ముందు కాళ్లను గాల్లో ఊపుతూ దాని వెంట పడింది. కొన్ని అడుగుల దూరం పోయిన తర్వాత ముందు కాళ్లతో రెండూ కొన్ని సెకన్లు కొట్టుకున్నాయి. ఓ జింక కాళ్లకు బుద్ది చెప్పి అక్కడినుంచి పరుగులు తీసింది. రెండో జింక దాని వెంటపడింది. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు