వైరల్‌: నడిసంద్రంలో భారీ అ‍గ్నిప్రమాదం..

3 Jul, 2021 11:30 IST|Sakshi
నడి సంద్రంలో ఎగసి పడుతున్న మంటలు(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

వైరలవుతోన్న వీడియో

మెక్సికో యుకాటన్‌ ద్వీపకల్సానికి పశ్చిమాన సముద్రపు ఉపరితంలో ఘటన

అండర్‌లైన్‌ పైప్‌లైన్‌ లీక్‌ కావడం వల్ల చోటు చేసుకున్న ప్రమాదం

వాషింగ్టన్‌/మెక్సికో: చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు. చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో.. అంతే భయంకరంగా కూడా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నడిసముద్రంలో అండర్‌వాటర్‌ పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో ఇలా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ సంఘటన మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. నీటి అడుగున పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పెమెక్స్‌ వెల్లడించింది.

నీటి నుంచి ఎగసిపడుతున్న ముదురు నారింజ వర్ణం మంటలు చూపరులను భయపెడుతున్నాయి. పెమిక్స్‌ కంపెనీకి అతి సమీపంలోని అండర్‌ వాటర్‌ పైప్‌లైన్‌ లీక్‌ కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పైప్‌లైన్‌ పెమిక్స్‌కు చెందిన అతి ముఖ్యమైన ‘కు మలూబ్‌ జాప్‌’ ఆయిల్‌ డెవలమెంట్‌ని పెమిక్స్‌ ప్లాట్‌ఫాంతో కలుపుతుంది. ఈ సందర్భంగా పెమిక్స్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఎవరు గాయపడలేదు.. ఉత్పత్తి కూడా నిలిచిపోలేదు. సుమారు ఐదుగంటల పాటు కష్టపడి మంటలను ఆర్పేశాము. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం’’ అన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు