Unburnable Book: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?

8 Jun, 2022 15:37 IST|Sakshi

చరిత్రలో కనుమరుగు అయిన పుస్తకాలు ఎన్నో. చెదలు పట్టడమో, ప్రమాదాల్లో నాశనం అయిపోవడమో జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. ఇక్కడో పుస్తకం ఎంతో ప్రత్యేకం.  మంటల్లో వేసిన కూడా తగలబడదు ఈ పుస్తకం. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?..  వెయ్యికిపైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా నాశనం కాదట!.

మార్గరెట్‌ అట్వుడ్‌ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్‌ నవలని ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్‌ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్‌ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్‌ని ఉపయోగించి ఈ బుక్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ అన్‌బర్నబుల్ బుక్ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో రూపొందించారు.

ఈ పుస్తకం వేలంలో కోటి రూపాయలకు పైనే పలకింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును..  స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే 'పెన్‌ అమెరికా' సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట. ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదే .

ఆ పుస్తక రచయిత అట్వుడ్‌ ఈ అన్‌బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్‌మెయిడ్స్ 'పెన్‌ అమెరికా' కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పుస్తకం చాలాసార్లు నిషేధించబడింది. అంతేకాదు బుక్ పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే పబ్లిషింగ్‌ సంస్థ, టోరంటోలోని  రీథింక్ క్రియేటివ్ ఏజెన్సీ, ది గ్యాస్ కంపెనీ ఇంక్ అనే రెండు కంపెనీలు ఉమ్మడిగా ఈ అన్‌బర్నబుల్ బుక్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టారు.

దాదాపు 2200 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతకు గురైనప్పటికీ నాశనం కాదని, పైగా ప్రత్యేకమైన ఇంక్‌తో ముద్రించబడిందని బుక్‌ డిజైనర్లు వెల్లడించారు. అంతేకాదు ఒక కెనడా రచయిత ఫ్లేమ్‌ త్రోవర్‌తో పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: 14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు ప్రవేశం లేదు)

మరిన్ని వార్తలు