20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్‌లో మిన్నంటుతున్న సంబరాలు

31 Aug, 2022 17:06 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు.

వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్‌ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున​ రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్‌ బలగాలు అఫ్గనిస్తాన్‌ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్‌ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్‌ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్‌.

ఈ విధ్యంసకర దాడికి  ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్‌ తన బలగాలను అప్గనిస్తాన్‌ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

(చదవండి: అఫ్గాన్‌ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్‌...ఐ డోంట్‌ కేర్‌ అంటున్న రష్యా)

మరిన్ని వార్తలు