సౌదీ ఏవియేషన్‌ చరిత్రలో తొలిసారి..

24 May, 2022 13:29 IST|Sakshi

Women-only Crew Operates: గల్ఫ్‌ దేశాల్లో మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సౌదీ అరేబియాలో తొలిసారిగా ఒక విమానాన్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా సిబ్బందే పనిచేస్తారు. ఇది మహిళా సాధికారతకు ఒక పెద్ద నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ విమానాన్ని ఇటీవలే ప్రారంభించామని ఒక చిన్న దేశీయ ప్రయాణాన్ని కూడా చేసిందని సౌదీ అధికారులు వెల్లడించారు. 

ఈ మేరకు వారు ఎర్రసముద్ర తీరం నుంచి జెడ్డా వరకు విమానాన్ని నడిపారని కూడా తెలిపారు.  ఫ్లైడీల్‌ ఈ విమానాన్ని ఆపరేట్‌ చేస్తుండగా,  సౌదీ విమానయాన చరిత్రలో తొలిసారిగా సరికొత్త ఏ 320 విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితో నడిపించిందని అన్నారు. అంతేకాదు ఈ విమానాన్ని నడిపిన మహిళా ఫైలెట్‌ కూడా అత్యంత పిన్న వయసురాలు కావడం మరో విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో ఎక్కువ శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించేలా చేసింది. 

(చదవండి: వైరల్‌ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్‌ బెల్ట్‌పై మృతదేహం?)

మరిన్ని వార్తలు