Open Letter: పుతిన్‌ను ఆపకపోతే ప్రపంచం మొత్తం పెనువిధ్వంసమే: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భార్య జెలెన్‌స్కా

9 Mar, 2022 11:27 IST|Sakshi

Olena Zelenska Open Letter: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ భార్య, ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్‌స్కా.. రష్యా యుద్ధకాండను నిరసిస్తూ ప్రపంచ మీడియాకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉక్రెయిన్‌ పౌరులపై రష్యా చేసిన సామూహిక మారణకాండను తీవ్రంగా ఖండించారు.

ఉక్రెయిన్‌ పై రష్యా నమ్మశక్యం కాని విధంగా దాడి చేస్తోంది. మాస్కో మద్దతుగల దేశాల హామీతోనే మా దేశాన్ని వ్యూహాత్మకంగా చట్టుముట్టి దాడి చేస్తున్నప్పటికి దీనిని ప్రత్యేక ఆపరేషన్‌ గా పిలుచుకుంటున్నారు. అంతేకాదు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడిచేయనని రష్యా చెప్పింది. అది(రష్యా) చేస్తున్న పనులకు చెబుతున్న మాటలకు పొంతనే లేదు. మాస్కో పౌరులపై ఏ విధంగా దాడి చేసిందో నేను వివరిస్తాను. చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులతోపాటు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అనాథలుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించిన విధ్వంసకర యుద్ధం. పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు.

A post shared by Olena Zelenska (@olenazelenska_official)

ఈ యుద్ధ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లలతో పారిపోయి అలసటతో ఉన్న తల్లుల కళ్లలోకి చూడండి, అంతేకాదు కేన్సర్‌ రోగులు ఈ సంక్షోభం కారణంగా అవసరమయ్యే కీమోథెరఫీ వంటి అత్యాధునిక చికిత్సలు అందక మరణిస్తున్నవారు కొందరూ. అంతేకాదు భారీ అగ్ని ప్రమాదాల కారణంగా ఆస్మా వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారిపరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దయ చేసి మా గగనతలం మూయండి అంటూ ఉక్రెయిన్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి ప్రేక్షపాత్ర వహించింది నాటో" అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లేఖ రాశారు.

(చదవండి:  నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్‌స్కీ డబుల్‌ గేమ్‌!)

మరిన్ని వార్తలు