Omicron Deaths: అక్కడ మొదటి ఒమిక్రాన్‌ మృతి కేసు నమోదు

27 Dec, 2021 15:20 IST|Sakshi

First Omicron Death In Australia: ఆస్ట్రేలియా న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో సోమవారం మొదటి ఒమిక్రాన్‌ మరణం సంభవించింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 6 వేలకు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్టు ధృవీకరించింది. కాగా పశ్చిమ సిడ్నీలోని ఓ వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలో ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి (80)గా గుర్తించారు. సదరు వ్యక్తి వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెల్పింది.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్‌లో సోమవారం ఒక్కరోజులోనే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంటెన్సివ్ కేర్‌లో 55 మంది ఉండగా, మొత్తం 524 మంది అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం నుంచి న్యూ సౌత్ వేల్స్‌లో కొత్త ఆంక్షలు అమల్లోకొచ్చాయి. బార్‌లు, రెస్టారెంట్లలో వ్యక్తుల మధ్య 2 చదరపు మీటర్ల దూరం పాటించవల్సిందిగా పేర్కొంది. సిబ్బంది కొరత కారణంగా కోవిడ్ -19కి గురైన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజార్డ్ మీడియాకు తెలిపారు.

ఇప్పటికే అమెరికా, యూకే, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే! తాజాగా ఆస్ట్రేలియాలో కూడా మరో మరణం నమోదుకావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు దేశాల్లో ఒమిక్రాన్‌ మృతి కేసులు సంభవించినట్లు తెలస్తోంది. కాగా 108 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఉధృతి కొనసాగుతోంది.

చదవండి: మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే!

మరిన్ని వార్తలు